నేటి నుండి సంగీత కార్యక్రమాలు
 
మే 2 నుండి 13 వరకు స్థానిక త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమితి సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి.
కార్యక్రమాల వివరాలు:
మే 2 - పెద్దేహపు సాయిబాబా బృందం నాదస్వరం, త్యాగరాజ పంచరత్న సేవ
మే 3,4,5 - ధూళిపాళ శివరామకృష్ణ శాస్త్రి భాగవతార్ హరికథ
మే 6 - చెన్నై కు చెందిన అనురాధ కృష్ణమూర్తి గాత్ర కచేరి
మే 7 - విజయవాడ కు చెందిన విష్ణుభట్ల సరస్వతి, విష్ణుభట్ల కృష్ణవేణి గాత్ర యుగళం
మే 8 - హైదరాబాద్ కు చెందిన జయప్రద రామమూర్తి వేణుగానం
మే 9 - చెన్నై కు చెందిన మహదేవన్ శంకర్ నారాయణన్ గాత్ర కచేరి
మే 10 - చెన్నై కు చెందిన ఆర్.సుర్యప్రకాష్ గాత్ర కచేరి
మే 11 - చెన్నై కు చెందిన అశ్వద్ధ నారాయణ గాత్ర కచేరి
మే 12 - భక్త ప్రహ్లాద కూచిపూడి యక్ష గానం
మే 13 - చెన్నై కు చెందిన స్మితా మాధవ్ గాత్ర కచేరి

పోస్ట్ చేసిన తేదీ:
2 మే 2016
 
 
  Copyright 2014 © Rajahmundrycity.com All Rights Reserved.