ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు
 
రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 24 వ తేదీ వరకు పొడిగించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.డేవిడ్ కుమార్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించని విద్యార్దులు ఈ నెల 24 వ తేదీలోగా ఆంధ్రాబ్యాంకు లో చలానా కట్టి అడ్మిషన్లు పొందవచ్చు. ఉపాధి అవకాశాలు లభించే ఆరు కొత్త కోర్సుల్లో 220 సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనరల్ మెరిట్ జాబితా కళాశాల వెబ్ సైటులో ఈ నెల 27 తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపారు.కళాశాలలో బి.ఏ, బి.కాం, బిఎస్సి మొదటి సంవత్సరం 1190 సీట్లు ఉండగా ఇప్పటికే 4120 దరఖాస్తులు వచ్చాయని ప్రిన్సిపల్ తెలిపారు.

Posted On : 20 May, 2017.
 
 
  Copyright 2014 © Rajahmundrycity.com All Rights Reserved.