నగరంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
 
హనుమాన్ జయంతిని రాజమండ్రి స్వామివారి ఆలయాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పుష్కరఘాట్ కు సమీపంలోని ఆంజనేయస్వామి వారి మటంలో విశేష పూజలు చేసారు. గోదావరిగట్టున ఉన్నటువంటి చిన్న ఆంజనేయస్వామి ఆలయంలో మూలవిరాట్ కు అభిషేకం చేసారు. కోటిపల్లి బస్టాండ్ ఆంజనేయస్వామి వారి ఆలయంలో మూలవిరాట్ ను తమలపాకులతో అలంకరించారు. సీతంపేట రామాలయంలోని వేడుకలు అంబరాన్నంటాయి. అయిడుబండ్ల మార్కెట్ సెంటర్ వద్ద ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Posted on : 22 May, 2017
 
 
  Copyright 2014 © Rajahmundrycity.com All Rights Reserved.